మహదేవి వర్మ
నేటి ఆధునిక హిందీ కవిత్వంలో మహదేవి వర్మ ఒక విశిష్ఠ శక్తిగా ప్రజ్వరిల్లినది. ఆమె తన జాతీయ బాష హిందీనీ బాదాతప్త హృదయముగా స్వీకరించినది. ఆ బాషకు తన మాదుర్యబావన కోమలత్వంలో నిండి తన సహజ మానవీయ వేదనకు అభివ్యక్తపరచే ద్వారాల్ని తెరిచారు. దానికి దీపజ్యోతి, దీపశిఖ అనే గౌరవాన్నిచ్చారు. వ్యక్తిపరమైన మానవత్వమనే కావ్యపరిశీలనను ప్రతిష్ఠింపచేశారు. వారి గీతములలోని నాదసౌందర్యం ముఖ్యమైన సూక్తుల బాణి హిందీలో అమరమైన సాహిత్యానికి ఎనలేని కీర్తినిచ్చిన శ్రీమతి మహదేవి వర్మ ఫరుఖాబాదలో హోలి పండగ రోజు జన్మించారు. ఉత్తరప్రదేశంలోని ప్రయాగలో ఆమె కీర్తీశేషులైనారు. ఆమె వ్యక్తిత్వంలో హిందుస్తానీ స్త్రీ యెక్క ఔదార్యం, కరుణ,సాత్వికత,కౌసల్యము,నవీనబుద్ది,సరళత్వము,గాంభీర్యము నిండి వున్నవి. ఆమె వ్యక్తిత్వము, కవిత్వము,పతిభా,పాటవాల విలక్షణతను గుర్తించిన సాహిత్యవేత్తలు ఆమెను సాహిత్య సామ్రాజ్ఞి అని, హిందీ విశ్రాంతి మందిరములోని సరస్వతి అని, శారదాదేవిమూర్తి అని ప్రశంశించారు. మహాదేవి వర్మగారు ఒక గురుతర బాధ్యతలో భాషాసాహిత్యం, విద్య, సమాజం, సంస్కృతిని సంస్కరించారు. కవితలో ఛాయవాదం, రహస్యవాదం దిశను తెలుసుకోనుటకే సామాజిక సమస్యల నివారణచేయుటలో క్రియాశీల భాధ్యత సాదించారు. 7 సంవత్సరాల బాలప్రాయములోనే మహాదేవి కవయిత్రి ప్రతిభ ప్రస్పుటమైనది. విధ్యార్ది దశ నుండి ఆమె కవితలు దేశములోని ప్రసిద్ద పత్రికల్లోవెలువడినవి. ప్రయాగలో అధ్యాపన వృత్తిలో ఉండుట వలన హిందీ బాష పట్ల ప్రత్యేక శ్రద్దతో సాహిత్య కార్యక్రమాలు చేసేవారు. ఆమె కేవలం “చాంద్” పత్రికకు సంపాదకత్వమే కాక హిందీ ప్రచార ప్రసారానికి సాహితీ సంస్ధను నెలకొల్పిరి. ఆమె “సాహిత్యకాर्ర్” నెల పత్రికకు సంపాదకత్వం వహించి ’’రంగవాణి’’ అనే నాట్య సంస్ధను స్ధాపించారు.
మహదేవి వర్మ విశిష్ఠ గద్య కర్తయే గాక మంచి చిత్రకారిణి కూడ. బెంగాలులో కరువు కాటకాల సందర్భంలో “బెంగాల్ దర్శన్” అని, చైనా ఆక్రమణ సందర్భంలో “హిమాలబయ్” అనే పత్రికకు సంపాదకత్వం వహించారు. చాయవాద కవులలో మహదేవి వర్మకి తనదైన ప్రత్యేక బాణి వుంది. ఆమె కవిత్వం వేదనలో పుట్టి కరుణలో నివసించినది. “నీహర్” పుస్తకం నుండి “దీపశిఖ” గ్రంధం వరకు వేదన యెక్క అనేక స్థితిగతులు అనుభూతులు అంకితమై ఉన్నాయి. మనుష్యుని సంపాదనా శీలహృదయాన్ని ప్రపంచానికి ఒక అవిచ్ఛిన్నమైన బంధనంలో అంతులేని కాలహద్దులు, అంతులేని మెండివైఖరి, ఆక్రోశము ఆమె కవితల్లో బంధించి పెట్టినది. ఆమె మానవీయ ప్రేమను కరుణా కావ్యంగా రూపొందించారు. కవిత లోతుల్లోకి వెళ్ళకుండా వారి కవితలో ఉన్న ధుఖఃవాదం ఆరోపణలు వచ్చినవి. వారి గ్రంధాలు “నీరభరీదుఃఖ్ కీ బదలీ’’ మరియు ‘’ఏకాకిని బరసాత్´’ చదివి ఘోర నిరాశావాదిగా ప్రకటించారు. వారి కావ్యములలో ఆత్మరతివాదం, ఆత్మపీడనావాదం మరియు పలాయనవాదాన్ని వెదకి అవి జీవితానికి అస్వీకృత కావ్యంగా చెప్పబడ్డాయి. విమర్శకుల భావన కేవలం ఒక దృష్ఠి మాత్రమే. ఆమె కవితలో భోదార్ధము యొక్క సునిశిత దృష్ఠి, దానిలో బాధ, నిరాశ, వేదన, ఫలాయిన తత్వాలున్నాయి. ఇది సత్యమైన విషయం తన ధుఃఖాన్ని కవితలో అనుభవిస్తు రూపొందించినా మహదేవి గారు సుఖవాదాన్ని వదలలేదు. సుఖసంతోషాన్ని పొందుటకే వారు వేదనతో మైత్రిని స్ధాపించుకున్నారు వారి కావ్యాలు జీవనసౌందర్యం ఆనందాన్ని ఆకాంక్షిస్తాయి. లేకపోతే బాధ, నిరాశలో మునిగియున్న మహదేవికి జీవితం ఆనందపు కలల్లో ఉండదు. కాబట్టి బాధ, వేదన యొక్క ఈ ప్రపంచమున వ్యతిరేకం కాదు. మహదేవి గారు ధుఖః, కరుణ యొక్క లౌకిక, ఆధ్యాత్మిక విషయములను సృష్ఠంచేసి దానికి విసృతమైన అర్ధాన్నిచ్చారు. వారి దార్శినిక విషయాలు, కల్పన మాద్యమంలో ఉన్న విసృత విషయాలు మానవుడు తన మానవీయ వ్యవహారాల్లో రూపొందించుకుంటాడు. ఆమె గద్యం కూడ ఒక విశిష్ఠ స్ధానాన్ని సంతరించుకున్నది. ఆత్మ-పరమాత్మకి సంబంధించిన విషయాలు మనిషి ప్రకృతికి వివిధ రూపాల్లో వున్నవి. ఆమెది ఒక ప్రత్యేకత భావవేగపు తీవ్ర క్షణాల్లో ఆమె ఒక కవిగా, కోమల కరుణ హృదయ, బాధాతప్త హృదయంతో దర్శనమిస్తారు. గద్యకర్త రూపంలో వారి ధృడసంకల్పము మనకు గోచరించును. మహదేవి గద్యం సంస్కృతి, భాష, స్త్రీ సమస్య నిర్భయ వ్యక్తీకరణ సృష్టమౌతుంది. ఆమె గద్యంతో భౌతికమైన విశ్లేషణ ముగింపుతో పాటు సంవేదన శీల హృదయం కూడ స్పందిస్తుంది. వారు ఏకాంత జీవితం యొక్క సంపూర్ణ చిత్రాలే కాక సంఘర్షణ, కోలాహలం, అలజడి,వికృతుల విద్రోహాత్మకంగా దెబ్బకొట్టారు. మహదేవి వర్మ నేటి రచనాకారుల్లా బుద్ధి వైభవంలో పాఠకులను ఆశ్చర్యంలో పడవేయలేదు ముఖ్య సిధ్ధాంతాలను కలిగి కవితలోనికి ప్రవేశపెట్టేవారు. వారి శ్రమంతా జీవితపు స్పందన, లోతైన మర్మాలను ఉధ్ఘాటించుటకే చీకటిలో వెలుతురులా వారి కవతలో ప్రపంచానికి పెద్దవెలుగు. హిందీలో ఈ వెలుగుల జాగృతి సరస్వతి శూన్యాంధకారానికి గౌరవం ఇచ్చింది.
వారి ముఖ్యరచనలు:
కావ్యాలు
నీహాల్, నీరజ, సంధ్యాగీత్, యామ, దీపశిఖ, సప్తపర్ణా, సంధీనీ
గద్య-రేఖా చిత్రములు
అతీత్ కే చలనచిత్ర, స్మృతికే రేఖాయేం, పధ్ కే సాధీ, మేర పరివార్
నిబంధ్-ఆలోచన
శృంఖలాకి కడియా, వివేచనాత్మకగద్య, క్షణధా, సాహిత్యకార్ కే ఆస్ధా, అన్యనిబంధ్, సంకల్పితం.
వివిధములు
స్మారిక, స్మృతి చిత్రములు, సంభాషణ సంచయన, దృష్ఠిభోధ్.
హిందీలో మహదేవి వర్మ విశిష్ఠస్థానాన్ని, గౌరవాన్ని పొందడాన్నికి ముఖ్య కారణం ఆమె సాహిత్యం. ఆమె సాహిత్యాన్ని తెలుగువారికి తెలియచేయటానికి నా ఈ చిన్నప్రయత్నంలో తప్పలు ఉంటే క్షమించమని ప్రార్దిస్తు అందరికి దన్యవాధములు.